Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు: నెల్లూరు జిల్లా టెలికం అడ్వైజరీ బోర్డు డైరెక్టర్ పదవి తనకు రావడానికి పూర్తిస్థాయిలో సహకరించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు ,గుర్రం మాల్యాద్రి , ఆదివారం సాయంత్రం తెదేపా కార్యాలయంలో దుశ్యాలువా కప్పి ,మిఠాయి తినిపించి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా గుర్రం మాల్యాద్రి మాట్లాడుతూ, తనపై ఎమ్మెల్యేకున్న అవ్యాజమైన ప్రేమకు నిదర్శనమే ఈ పదవి అన్నారు. ఎమ్మెల్యే ఇంటూరి మాట్లాడుతూ , గుర్రం మాల్యాద్రి తనకు నమ్మకస్తుడైన ఆప్త మిత్రుడన్నారు. గుర్రం మాల్యాద్రి భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులను పొందాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బాధ్యులు దామా మల్లేశ్వరరావు, ఉన్నం కొండలరావు, చుండూరు ప్రసాద్, నూతలపాటి తిరుపతి వెంకయ్య, గోరంట్ల బ్రహ్మయ్య, ముచ్చు ఓంకారం తదితరులు పాల్గొన్నారు* .
భవిష్యత్తులో మరెన్నో పదవులు అలంకరించాలని ఎమ్మెల్యే ఆకాంక్ష
Admin
Amaravathi Jyothi